నటి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొని కిరీటాన్ని కైవసం చేసుకుంది. అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీకి ఈ చిన్నది పరిచయమైంది. 2003 సంవత్సరంలో ప్రియాంక బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించిన ఈ చిన్నది వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే దాదాపు కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2016 సంవత్సరంలో ఆస్కార్ అవార్డులలో ఈ చిన్నది పాల్గొంది. 

ఆ వేడుకలో భాగంగా ఈ చిన్నది పెట్టుకున్న చెవి దిద్దులు పెద్ద చర్చకు దారితీసాయి. అవి దాదాపు 20 కోట్లకు పైనే ఖరీదైనవని సమాచారం అందింది. దీంతో ఈ అమ్మడు 20 కోట్లకు పైనే ఖరీదైన చెవిదిద్దులు పెట్టుకోవడంతో అనేక రకాల విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ బ్యూటీకి ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. తను ధరించే డ్రెస్ తో సహా ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్ గా ఉండే విధంగా చూసుకుంటుంది. దానికోసం ఆమె కోట్లలో డబ్బులను ఖర్చు చేయడానికి వెనుకాడదు. ప్రియాంక చోప్రా ఉపయోగించే ప్రతి వస్తువులలో ఓ ప్రత్యేకత దాగి ఉంటుంది. అంతే కాకుండా ఆమె వాడే వస్తువుల ఖరీదు చాలా ఎక్కువ. ప్రియాంక చోప్రా కొనుగోలు చేసే వస్తువులు కోట్ల విలువ చేసేవిగా ఉంటాయి.

ఈ మధ్యకాలంలో ప్రియాంక చోప్రా ముంబైలో తనకు సంబంధించిన ఆస్తులను కొన్ని కోట్లకు అమ్మేసినట్టుగా బాలీవుడ్ సర్కిల్స్ లో సమాచారం అందింది. ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేయడం తగ్గించి హాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు వెళ్ళింది. ప్రియాంక చోప్రా సినిమాలలో రాణిస్తున్న సమయంలోనే హాలీవుడ్ నటుడు, పాప్ సింగర్ నిక్ జాసన్ ను ప్రేమించి వివాహం చేస్తుంది. వివాహం తర్వాత ఈ చిన్నది హాలీవుడ్ లో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ భారీగా డబ్బులను సంపాదిస్తోంది. కోట్లలో డబ్బులను రాబడుతోంది. ప్రియాంక చోప్రాకు కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.


దాదాపు ప్రియాంక చోప్రా ఆస్తులు 1000 కోట్లకు పైనే ఉన్నట్టుగా అధికారులు అంచనాలు వేస్తున్నారు. లాస్ ఏంజెల్స్ లో ఆమె 100 కోట్ల ఖరీదైన భవనాన్ని నిర్మించుకుంది. అంతేకాకుండా హైదరాబాద్, ముంబై, చెన్నై లాంటి అనేక నగరాల్లో ప్రియాంక చోప్రాకు భవనాలు ఉన్నాయి. అంతే కాకుండా ఖరీదైన కార్లు కూడా ఆమె గ్యారేజ్ లో ఉన్నాయి. కోట్లలో విలువ చేసే నగలు, ఆభరణాలు ప్రియాంక చోప్రా వద్ద ఉండడం విశేషం. ఇక ఆమె భర్త కూడా సినిమాల ద్వారా భారీగానే డబ్బులను సంపాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: