నటి శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాలలో ఎలాగైనా రాణించాలనే ఉద్దేశంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న శోభిత ధూళిపాళ తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగించింది.



ఇక తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. తెలుగు, హిందీ, మలయాళ అనే తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోయింది. ఇక ఈ చిన్నది టాలీవుడ్ నటుడు నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత శోభిత ధూళిపాళ ఏదో ఒక వీడియోతో, ఫోటోతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. శోభితకు సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలను కొంతమంది నెటిజెన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.


ఐనప్పటికి శోభిత వాటిని ఏమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. నాగ చైతన్యతో వివాహం తర్వాత శోభిత తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తుంది. ఎలాంటి సినిమాలు, సిరీస్ లలో నటించడం లేదు. ఇక తనకు, తన భర్తకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే శోభితకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.


ఆ వీడియోలో శోభిత జిమ్ కి వెళ్లి ఇంటికి తిరిగి వెళుతుండగా అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు ఈ చిన్న దానికి సంబంధించిన వీడియోను రికార్డ్ చేశారు. ఆ వీడియోలో శోభిత చాలా పొట్టి బట్టలు ధరించింది. ఆ వీడియోని చూసిన చాలా మంది శోభిత చాలా హాట్ గా, అందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: