టాలీవుడ్, బాలీవుడ్ లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హన్సిక.. అయితే హన్సిక తో పాటు హన్సిక తల్లి జ్యోతి  ఇటీవలే బాంబే హైకోర్టును సైతం ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. తమ పైన నమోదైన గృహహింస కేసును సైతం కొట్టివేయాలి అంటూ అటు కోర్టుని ఆశ్రయించారు.. హన్సిక సోదరుడు భార్య ముస్కాన్ జేమ్స్ పెట్టినటువంటి సెక్షన్ 498 A కింద పెట్టిందట. దీంతో అటు హన్సిక తన తల్లి పైన వేసిన ఇపిటిషన్ పైన జస్టిస్ సారంగ్ ,జస్టిస్ మోదక్ ఈ కేసును విచారించారట. దీంతో హన్సిక సోదరి భార్య ముస్కాన్ జేమ్స్ కు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.


తీర్పును జులై 3వ తేదీన తదుపరి విచారణ చేపట్టబోతున్నట్లు తెలియజేశారు. హన్సిక సోదరుడు ప్రశాంత్ 2020 డిసెంబర్లో ముస్కాన్ జేమ్స్ అనే ఒక టీవీ నటిని పెళ్లి చేసుకున్నారు. 2022 డిసెంబర్లో వీరి వీడిపోవాలనుకున్నారు.. కానీ ఆమె 2024 డిసెంబర్లో హన్సిక, తల్లి జ్యోతి , సోదరుడు పైన ముస్కాన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీరి మీద 498A,323,504,506 కింద నేర ఆరోపణలను సైతం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ముందస్తు  బెయిల్  హన్సిక ఆమె తల్లి ముంబై కోర్టును సైతం కోరుతూ పిటిషన్ వేయగా. ముందస్తు బెయిల్ మంజూరు చేసిందట.


కానీ తమ పైన ప్రతికారాం తీర్చుకునేందుకు ఇలా ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ హన్సిక వెల్లడించింది. ఇక హన్సిక సోదరుడు పెళ్లి కోసం తాను 27 లక్షల రూపాయలు ఖర్చు చేశానని తిరిగి ఇవ్వాలని అడిగినందుకే తన పైన ఇలా కేసు పెట్టిందంటూ తెలిపారు. తాను వారి యొక్క వెడ్డింగ్ ప్లాన్ కోసమే ఆ డబ్బులు ఇచ్చానని కూడా హన్సిక వివరించింది. ఇంతవరకు ఈ డబ్బులను తన సోదరుడు కానీ ముస్కాన్ కానీ ఇవ్వలేదంటూ తెలియజేసిందట. తన సోదరుడు , తన భార్య మధ్య విభేదాలు తలెత్తడంతో వారు మితిమీరి స్పందిస్తూ తన మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరిగేలా చేస్తున్నారంటూ ఈ ఎఫ్ఐఆర్ ని కొట్టేయాలంటూ ఆమె కోరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: