సూపర్ స్టార్ మహేష్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. “SSMB29” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ని మార్చుకున్నాడు.. గంటల తరబడి జిమ్ లో వర్క్ ఔట్ చేసి సినిమాలో తాను చేసే పాత్రకు కావాల్సిన పర్ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను రాజమౌళి సీక్రెట్ గా స్టార్ట్ చేసాడు.. ఈ సినిమా షూట్ గురించి చిన్న లీక్ కూడా రాకుండా రాజమౌళి షూటింగ్ ప్లాన్ చేసాడు..కానీ షూటింగ్ లో కొన్ని లీక్స్ రావడంతో సీరియస్ అయిన రాజమౌళి.. షూటింగ్ ఆవరణలో మరింత కఠిన నియమాలు పెట్టారు..

 ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్మారు.. ఇటీవలే ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. త్వరలోనే మూడో షెడ్యూల్ ని రాజమౌళి భారీగా ప్లాన్ చేస్తున్నాడు.. ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళం స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.. ఫ్యాన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.. అయితే తమ హీరో ఫస్ట్ లుక్ లేదా కనీసం సినిమా టైటిల్ ని అయినా రివీల్ చేయాలనీ ఫ్యాన్స్ రాజమౌళి ని రిక్వెస్ట్ చేస్తున్నారు..

అయితే మంచి సమయం కోసం ఎదురు చూస్తున్న జక్కన్న మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఇంపార్టెంట్ డేట్ అయిన మే 31 న  ఈ సినిమాకు సంబంధించి 2నిమిషాల సర్ ప్రైజింగ్ వీడియో రిలీజ్ చేయనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..ఫస్ట్ లుక్, టైటిల్ ను ఓ ప్రత్యేక సందర్బంలో రిలీజ్ చేయాలనీ రాజమౌళి చూస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: