టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. తన నటన, అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఆ సినిమా అనంతరం వరుసగా కొన్ని సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఇక సినిమాలలో నటిస్తున్న సమయంలోనే మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడింది. 


వీరిద్దరూ కలిసి సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు సీక్రెట్ గా వారి రిలేషన్ కొనసాగించిన ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. వివాహం తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలు చేయడం పూర్తిగా మానేసింది. తన పూర్తి సమయాన్ని తన కుటుంబంతో గడుపుతోంది. వరుణ్ తేజ్ మాత్రం వరసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇక లావణ్య త్రిపాఠి సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు, తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ అచ్చ తెలుగు అమ్మాయి వలె కనిపిస్తూ కుందనపు బొమ్మల ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే నటి లావణ్య త్రిపాఠి ఉగాది పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.

ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఆ ఫోటోలలో లావణ్య త్రిపాఠి చాలా బొద్దుగా కనిపిస్తోంది. ఆ ఫోటోలు చూసిన చాలామంది లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అని కామెంట్లు చేస్తున్నారు. ప్రెగ్నెంట్ అయినవారు కాస్త లావుగా, బొద్దుగా కనిపిస్తారు. అలానే లావణ్య త్రిపాఠి కనిపించడంతో ప్రతి ఒక్కరూ ప్రెగ్నెంట్ అని ఫిక్స్ అవుతున్నారు. ఈ వార్తలపై మెగా కుటుంబ సభ్యులు ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: