తమిళ నటుడు మాధవన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో తమిళ సినిమాలలో నటించి చాలా విజయాలను అందుకొని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మాధవన్ కేవలం తమిళ సినిమాలలో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన కెరియర్ ప్రారంభంలో ఎక్కువ శాతం మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే మణిరత్నం కొన్ని సంవత్సరాల క్రితం సూర్య , సిద్ధార్థ్ , మాధవన్ ప్రధాన పాత్రల్లో యువ అనే సినిమాను రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

మాధవన్ ఈ సినిమాలో  ఇన్బా పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే మొదట మణిరత్నం యువ సినిమాలో మాధవన్ ను అనుకున్నప్పుడు సిద్ధార్థ్ చేసిన పాత్రలో తీసుకోవాలి అనుకున్నాడట. అందులో భాగంగా మణిరత్నం , మాధవన్ కి ఈ సినిమా కథ చెప్పాడట. కానీ చివరగా మాధవన్ మాత్రం సిద్ధార్థ్ చేసిన పాత్ర కాకుండా ఇన్బా పాత్ర చేయాలి అని అనుకుంటున్నట్లుగా మణిరత్నం కి చెప్పాడట. దానితో మణిరత్నం ఎందుకు ఆ పాత్రను ఎంచుకున్నావు అని అడిగాడట. దానితో ఆ పాత్ర మాత్రమే గొప్పగా ఉంది అని ఆయన చెప్పాడట. కానీ మణిరత్నం దానికి పెద్దగా సంతృప్తి చెందలేదట.

దానితో మాధవన్ ఆ పాత్ర కోసం గుండు చేయించుకొని సన్ క్రీమ్ లేకుండా కొన్ని రోజుల గోల్ఫ్ ఆడి రంగు కాస్త మారాక మణిరత్నం ను కలవడానికి ఆయన ఆఫీసుకు వెళ్ళాడట. అక్కడ ఆ ఆఫీస్ వ్యక్తులు ఎవరో వచ్చారు అని మాధవన్ ను లోపలికి పంపలేదట. ఇక చివరకు ఆఫీస్ వ్యక్తులు ఎవరో మిమల్ని కలవడానికి వచ్చారు అని మణిరత్నం కి చెప్పగా ఆయన బయటకు వచ్చి మాధవన్ ని చూసి షాక్ అయ్యాడట. దానితో మాధవన్ ఇప్పుడు ఇన్బా పాత్రలో నన్ను తీసుకుంటారా అని అడిగాడు. దానితో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మాధవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: