
అయితే ఇందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ విషయంపైన వర్మ స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. వర్మ ఇప్పటికే ప్రభాస్ నటించిన కల్కి 2898AD చిత్రంలో కూడా నటించారు. ఇందులో ఒక క్యామియో పాత్రలో నటించారు. వర్మ కనిపించిన సీన్స్ కొద్దిసేపైనా కూడా థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్ లభించింది. అందుకే సందీప్ రెడ్డి వంగ కూడా స్పిరిట్ సినిమాలో ఆర్జీవిని తీసుకోబోతున్నట్లు టాక్ అయితే వినిపించింది. కానీ ఈ విషయంపైన వర్మ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చేశారు.
ప్రభాస్ తో మరొకసారి కలిసి మీరు వెండితెర పైన కనిపించబోతున్నారంట అని ప్రశ్నించగా.. స్పిరిట్ సినిమాలో తాను నటించడం లేదు ఎందుకంటే అసలు నేను సందీప్ వంగాని ఎప్పుడు కూడా ఆ విషయం పైన అడగలేదు. దాని గురించి ఏమీ తెలియదు అంటూ తెలిపారు.. నాగ్ అశ్విన్, అశ్వని దత్, ప్రభాస్ తెలుసు కాబట్టి సరదాగా కల్కి సినిమాలో చేయమని అడిగారు.. అందుకే చేశాను తప్ప దాని కోసం పెద్దగా నేను ఆలోచించేదేమీ లేదు అంటూ కూడా తెలియజేశారు. కల్కి సినిమాలో నా పాత్రకి జనాల నుంచి వచ్చిన రియాక్షన్ తనకే సర్ప్రైజ్ అయ్యేలా చేసింది అంటూ తెలియజేశారు వర్మ.