సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అనుకోని పరిస్థితుల వల్ల హీరోహీరోయిన్లు చేయాల్సిన కొన్ని సినిమాలు చేయకుండా దూరమవుతారు.. చివరకు వాళ్ళు చేయాల్సిన పాత్రను మరొకరి చేసి మంచి పేరు సంపాదించుకున్నప్పుడు చాలా బాధపడ్డ సందర్భాలు ఉంటాయి. అలా హీరో విలన్ నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర ఆ మెగా హీరో వల్ల  తమిళ్ లోని ఒక అద్భుతమైన సినిమాలో నటించడం మిస్ అయిందట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తాజాగా నవీన్ చంద్ర హీరోగా 28° c సినిమా ఏప్రిల్ 4 అనగా ఈరోజు రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రాన్ని పొలిమేర దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. 

ఇది ఆ దర్శకుడి యొక్క మొదటి చిత్రం అయినా కానీ పలు కారణాలవల్ల ఆలస్యంగా విడుదలవుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ చంద్ర ఒక విషయాన్ని బయట పెట్టారు.. తాను గేమ్ ఛేంజర్ చిత్రం వల్ల ఒక మంచి చిత్రాన్ని మిస్ అయ్యానని బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చారు. తమిళ్ లో నాకు అనేక ఆఫర్స్ తన్నుకొస్తున్నాయి. ఇదే సమయంలో నేను గేమ్ ఛేంజర్ సినిమాకు చాలా డేట్స్ ఇచ్చాను. ఈ క్రమంలోనే సూర్య హీరోగా చేసినటువంటి రెట్రో మూవీ ఛాన్స్ వచ్చింది.

ఇందులో ప్రధాన విలన్ గా నన్ను చేయమని అడిగారు. కానీ ఆ టైంలో నేను గేమ్ ఛేంజర్ మూవీలో చేస్తున్నాను. ఈ చిత్రం వల్ల నేను రెట్రో మూవీలో అవకాశం మిస్ అయ్యానని నవీన్ చంద్ర బాధపడ్డారు. అయినా గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవడంతో ఆయన బాధ మరింత పెరిగిపోయిందట. కానీ శంకర్ గారు పిలిచి మళ్ళీ అవకాశం ఇచ్చినా కూడా సినిమాలో చేస్తాను అంటూ నవీన్ చంద్ర చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: