తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ తో హీరో గా కెరియర్ను మొదలు పెట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో నటుడిగా నవీన్ కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఆ తర్వాత ఈయన జాతి రత్నాలు అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఒక్క సారిగా నవీన్ క్రేజ్ తెలుగు లో భారీగా పెరిగిపోయింది.

ఆఖరుగా నవీన్ "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి విజయాన్ని అందుకున్నాడు. ఇలా నవీన్ ఇప్పటి వరకు హీరో గా నటించిన మూడు సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకున్నాడు. దానితో ఈయనకు తెలుగులో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం నవీన్ "అనగనగా ఒక రాజు" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం వారు విడుదల చేయగా అభిప్రాక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విలేజ్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతున్నట్లు , అలాంటి సినిమాలకు సంక్రాంతి సమయంలో మంచి ప్రేక్షకదరణ దక్కుతుంది అనే ఉద్దేశంతో ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగకు విడుదల చేయడం పర్ఫెక్ట్ అనే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు అనుగుణంగా ఈ సినిమా పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: