టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మరియు నిర్మాత అయినటువంటి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాల్లో హీరోగా నటించి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే అనేక సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా కళ్యాణ్ రామ్ కి బింబిసారా మూవీ తో మంచి విజయం దక్కింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అమిగోస్ , డెవిల్ సినిమాలు మంచి అంచనాల నడుమ విడుదల అయినా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో సక్సెస్ కాలేకపోయాయి. 

ఇకపోతే కళ్యాణ్ రామ్ తాజాగా అర్జున్  S/O వైజయంతి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అలనాటి స్టార్ నటి విజయశాంతి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇకపోతే ఇన్ని రోజుల పాటు ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించలేదు. కానీ ఈ మూవీ కి సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ని ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయనున్నట్లు  ఈ చిత్ర బృందం వారు తాజాగా ప్రకటించారు.

ఇక ఈ మూవీ విడుదల తేదీకి ఇంకా చాలా తక్కువ రోజులే ఉంది. ఇలా ఈ మూవీ యూనిట్ వారు సడన్ గా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీ నుండి ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఈ మూవీ పై జనాలు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

nkr