సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని పేరు ప్రఖ్యాతలతో పాటు, ఆస్తులు అంతస్తులు సంపాదించుకున్న ఎంతోమంది దర్శక నిర్మాతలు హీరోలు ఉన్నారు. అదే సినిమా వల్ల పూర్తిగా గౌరవం, ఆస్తులు అన్నీ కోల్పోయిన దర్శక నిర్మాతలు హీరోలు ఉన్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీసే నిర్మాతగా ఉన్నటువంటి అశ్వినీ దత్  ఆ ఒక్క సినిమా వల్ల దారుణంగా లాస్ అయిపోయారు. చివరికి అప్పుల వాళ్లు తన ఇంటి మీదకు వచ్చి లొల్లి చేసే పరిస్థితి ఆయనకే ఏర్పడింది. ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే ఎన్టీఆర్ హీరోగా నటించిన శక్తి.. రామ్ చరణ్ హీరోగా జక్కన్న డైరెక్షన్లో వచ్చినటువంటి  మగధీర సినిమా ఎంతటి హిట్ అయిందో మనందరికీ తెలుసు. 

అయితే ఈ సినిమాకి రిలేటెడ్ గానే అశ్వినీ దత్  శక్తి మూవీ ని తెరకెక్కించారు. కానీ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల బాక్సాఫీస్ వద్ద  ఈ మూవీ దారుణంగా విఫలమైంది. చివరికి పెట్టిన డబ్బులు కనీసం ఫైవ్ పర్సెంట్ కూడా రాకపోవడంతో అశ్వినీ దత్ దారుణంగా నష్టపోయాడని రైటర్ తోట ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రామ్ చరణ్ లాగా ఎన్టీఆర్ ని కూడా  తీర్చిదిద్దామనుకున్నా మొత్తం ఈ సినిమా  డిజాస్టర్ అయిపోయింది. దీనివల్ల ఆయన ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఎన్టీఆర్ కెరియర్ లో అత్యంత డిజాస్టర్ సినిమాగా పేరు తెచ్చుకుంది.

ఈ విధంగా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మగధీర సినిమాను చూసి శక్తి సినిమా తీద్దాం అనుకున్నారా అంటూ నెటిజన్ లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం శక్తి సినిమాను ఉన్నది ఉన్నట్టుగా ఉంచకుండా చివరి సమయంలో కాస్త చేంజెస్ చేయడం వల్ల కథ పూర్తిగా దెబ్బతిన్నదట. ప్రేక్షకులకు నచ్చకపోవడంతో అది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందని తోట ప్రసాద్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: