కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో విక్రమ్ ఒకరు. విక్రమ్ ఇప్పటివరకు తన కెరియర్లో చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ అందులో కొన్ని మూవీలు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి. అయినా కూడా ఈయనకు అద్భుతమైన గుర్తింపు ఉంది. అందుకు ప్రధాన కారణం విక్రమ్ హిట్ , ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ వస్తాడు. దానితో విక్రమ్ తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ను ఏర్పరచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే విక్రమ్ వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న ఆయనకు మాత్రం విజయం వచ్చి చాలా కాలమే అవుతుంది. తాజాగా విక్రమ్ "వీర ధీర శూర" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ సినిమా మార్చి 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ ప్రేక్షకుల నుండి లభించింది. దానితో ఈ మూవీ కి మంచి కలెక్షన్స్ దక్కుతూ వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలియజేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రకారం ఈ సినిమాకు ఇప్పటి వరకు 52 ప్లస్ కోట్ల కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా వచ్చినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. 

పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు దక్కుతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ మరికొన్ని రోజుల పాటు మంచి కలెక్షన్లను వసూలు చేసి అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: