కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న మ్యాడ్ మూవీ కి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ అనే సినిమాను రూపొందించారు. ఈ మూవీ ని మార్చి 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 6 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

6 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 10.66 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 3.11 కోట్లు , ఉత్తరాంధ్ర లో  2.94 కోట్లు , ఈస్ట్ లో 1.87 కోట్లు , వెస్ట్ లో 95 లక్షలు , గుంటూరు లో 1.69 కోట్లు , కృష్ణ లో 1.37 కోట్లు , నెల్లూరు లో 79 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 6 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 23.38 కోట్ల షేర్ ... 38.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 6 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 1.70 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 5.42 కోట్ల కలెక్షన్లు దక్కాయి. 6 రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 30.15 కోట్ల షేర్ ... 53.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 22 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని 8.50 కోట్ల లాభాలను కూడా అందుకని హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ మరికొన్ని రోజులు పాటు మంచి కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: