
ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు సిద్ధం అయ్యింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో టెస్ట్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ఏప్రిల్ 4 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. టెస్ట్ లో బ్యూటీ నయనతార, స్టార్ హీరోస్ మాధవన్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఉద్వేగం సినిమా ఇప్పటికే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాని గతేడాది నవంబర్ లో థియేటర్ లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీని మహిపాల్ రెడ్డి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఉద్వేగం సినిమాలో త్రిగుణ్, దీప్సిక, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రలలో నటించారు. అలాగే నేడు పూజిత పొన్నాడ, తులసి నటించిన ఉత్తరం సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సోనియా సింగ్, శ్రీహన్ నటించిన లైఫ్ పార్ట్ నర్ అనే సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ఈటీవీ విన్ లో ఏప్రిల్ 6 నుండి ఆడనుంది.
ఏప్రిల్ 4న హోమ్ టౌన్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో కీలక పాత్రలలో రాజీవ్ కనకాల, ఝాన్సీ నటించనున్నారు. నవదీప్, దీక్షిత్ శెట్టి నటించిన టచ్ మీ నాట్ మూవీ కూడా ఈ నెల 4న జియో హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ కానుంది. టుక్ టుక్ అనే సినిమా ఏప్రిల్ 10న ఓటీటీ విడుదల అయ్యి సందడి చేయనుంది. ఈ సినిమా మ్యాజిల్ పవర్స్ గురించి చూపిస్తుంది.