తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వెంకీ కుడుముల ఒకరు. ఈయన ఛలో మూవీతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఆ తర్వాత భీష్మ మూవీ తో ప్రేక్షకులను పలకరించి మరో సక్సెస్ ను అందుకున్నాడు. ఇలా వరుసగా ఈయన రూపొందించిన రెండు మూవీలు కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు ఏర్పడింది. తాజాగా ఈయన నితిన్ హీరోగా రాబిన్ హుడ్ అనే సినిమాను రూపొందించాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో రాబిన్ హుడ్ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుంది అని , వరుస అపజయాలతో డిలా పడిపోయి ఉన్నా నితిన్ కి వెంకీ కుడుముల మంచి విజయాన్ని అందిస్తాడు అని చాలా మంది భావించారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా బాగుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ భారీ అపజయాన్ని అందుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యింది. ఈ 6 రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.


6 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 2.20 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 70 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.21 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 6 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.11 కోట్ల షేర్ ... 9.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 6 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 38 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 78 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 6 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 6.27 కోట్ల షేర్ ... 12.42 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 28.50 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా మరో 22.23 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: