దివంగత సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు టిడిపి పార్టీని స్థాపించిన నాయకుడు.. ముఖ్యమంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన నాయకుడు.. ఈయన గురించి చెప్తే మాటలు సరిపోవు. కానీ చివరి రోజుల్లో మాత్రం చాలా ఇబ్బందులకు గురై చనిపోయాడు. ముఖ్యంగా తన ఇంట్లో వాళ్లే తనను వ్యతిరేకించడంతోపాటు పార్టీలో నుండి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో నుండి గద్దెదించి కొంతమంది వెన్నుపోటు పొడిచారు అంటూ ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సొంత మామకి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు అని కూడా అంటూ ఉంటారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే నందమూరి ఫ్యామిలీ ఆయన్ని దూరం పెట్టిందని,లక్ష్మీపార్వతి ఇంట్లో విషయాలతో పాటు రాజకీయాల్లో కూడా కలగజేసుకోవడం వల్లే పార్టీ ఏమైపోతుందోనని చంద్రబాబు పార్టీని చేతుల్లోకి తీసుకున్నారని అంటూ ఉంటారు. 

అయితే తాజాగా లక్ష్మీపార్వతిమీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్లు చేసింది. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ నా చెప్పు చేతుల్లో ఉండేవారు. నేనేది చెబితే అదే వినేవారు. నాకు ఆయన రెండుసార్లు పార్టీలో మంత్రి అవకాశం ఇచ్చారు. కానీ నేను పార్టీ విషయాల్లో కలగజేసుకోవడం వారికి నచ్చలేదు. అందుకే వెన్నుపోటు పొడిచారు. నా మీద ఉన్న అసూయతోనే వాళ్ళు అలా కుట్రలు చేసి అందరూ ఒక్కటై మా మీద ఈర్ష పెంచుకొని వెన్నుపోటు పొడిచారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు ఇద్దరు కలిసి నా భర్తకు వెన్నుపోటు పొడిచారు. దాంతో అధికారం మొత్తం వారి చేతుల్లోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ నాకు ప్రాముఖ్యత ఇవ్వడం వారికి నచ్చక నాపై ఈర్ష్య పెంచుకున్నారు.

ఎన్టీఆర్ నేను చెప్పినట్లు నా చెప్పు చేతల్లో ఉండడం కూడా వారు సహించలేకపోయారు అంటూ లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చింది. ఇక లక్ష్మీపార్వతి మాటలు వింటుంటే ఎన్టీఆర్ ని అప్పట్లో బొమ్మలా ఆడించిందని అందరికీ అర్థమవుతుంది. లక్ష్మీపార్వతి ఏం చెబితే ఎన్టీఆర్ కూడా అదే వినేవారని ఆమె మాటల్లోనే స్వయంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ నా చెప్పు చేతల్లో ఉండేవారని లక్ష్మీపార్వతి మాట్లాడడంతో నందమూరి ఫ్యామిలీలో గొడవలకి ఎన్టీఆర్ ని పక్కన పెట్టడానికి ప్రధాన కారణం లక్ష్మీపార్వతే అని అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది.ముఖ్యంగా ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించి కొద్దికొద్దిగా ఫ్యామిలీని మొత్తం దూరం చేసి లక్ష్మీపార్వతే నా జీవితం అనేంతలా ఎన్టీఆర్ ని మార్చేసిందని ఇప్పటికే ఎంతోమంది తెలిపారు. అలా మరోసారి లక్ష్మీపార్వతి తన మాటలతో అది నిజమే అని నిరూపించింది అంటున్నారు ఆమె మాటలు విన్న చాలామంది నందమూరి అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: