
అలా బాహుబలి చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించి సరికొత్త ట్రేండిని సెట్ చేశారు. ఈ విషయంలో చాలామంది డైరెక్టర్లు సైతం రాజమౌళిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళుతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా రెండు భాగాలుగా తీయడం బిజినెస్ కోసమే ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నారనే విధంగా చర్చలు వినిపిస్తున్నాయి. చాలామంది ల్యాగ్ సినిమాలో తీస్తున్నారనే టాకు కూడా వినిపిస్తోంది.SSMB - 29 చిత్రాన్ని కూడా రెండు బాగాలుగా తీయబోతున్నారని టాక్ వినిపించినప్పటికీ ఒక్క భాగగానే తీస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
RRR చిత్రం లాగే నిడివి ఎక్కువగా ఉండేలా..SSMB 29 సినిమాని కూడా ఒకే పార్టులో తీసేలా రాజమౌళి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ఆసక్తికరమైన కథను, ఇంట్రడక్షన్, ఉత్కంఠ పరిచే ఇంటర్వెల్, క్లైమాక్స్ తో కూడా అదరగొట్టే విధంగా సరికొత్త స్టోరీ రాజమౌళి చూపించబోతున్నారట. అందుకు సంబంధించి ఒక స్పెషల్ వీడియోతో త్వరలోనే ఆడియన్స్ ముందుకు సగం సప్రైజ్ ఇవ్వబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అడ్వెంచర్ చిత్రంలో హీరోయిన్ల ప్రియాంక చోప్రా అలాగే మరొక నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ లభిస్తూ ఉండగా ఇటీవలే కూడా ఈ సినిమా షూటింగ్ సంబంధించి సన్నివేశాలు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. మరి విడుదల తేదీని కూడా కన్ఫామ్ చేస్తారో చూడాలి.