
సీనియర్ హీరోలలో రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవి టాప్ లో ఉన్నారు. రీఎంట్రీలో చిరంజీవి నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే. చిరంజీవి పారితోషికం ప్రస్తుతం 75 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ప్రస్తుతం సీనియర్ హీరోలలో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న మరో హీరో అయితే లేరనే చెప్పాలి.
చిరంజీవి బాబీ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి కొన్ని సినిమాలు ఫ్లాపైన నేపథ్యంలో కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యంగ్ డైరెక్టర్లకు చిరంజీవి ఛాన్స్ ఇస్తున్నారు.
ఈ ఏడాదే చిరంజీవి విశ్వంభర సినిమా విడుదల కానుండగా చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది. చిరంజీవి అనిల్ కాంబో మూవీకి సుష్మిత కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి అనిల్ కాంబినేషన్ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. చిరంజీవి కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సంచలనాలు సృష్టించే దిశగా అడుగులు వేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.