
ఈ సినిమా కోసం 12 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంది సాయి పల్లవి అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ పాత్రలకి పెట్టింది పేరు నయనతార . ఎటువంటి డైరెక్టర్ అయిన సరే లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే ముందుగా నయనతారని గుర్తు చేసుకుంటారు . అలాంటిది ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమా అనగానే ముందుగా సాయి పల్లవి పేర్లు సజెస్ట్ చేస్తున్నారట మేకర్స్. నయనతారకు పెళ్లయిపోయింది. ఇద్దరు పిల్లల తల్లి ..పైగా సోషల్ మీడియాలో హ్యూజ్ నెగిటివిటీ క్రియేట్ చేసుకుంది .
ఆమెతో సినిమా అంటే కచ్చితంగా కొంచెం కాంట్రవర్షియల్ మ్యాటర్ అనుకుంటున్నారట . సాయి పల్లవి అయితే ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్రలకు బాగా సూట్ అవుతుంది .. పైగా ఎక్స్పోజింగ్ చేయదు . సినిమా కంటెంట్ బాగుంటేనే సినిమాలో నటిస్తుంది . సినిమా హిట్ అవ్వడానికి ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సహాయపడుతుంది .. అన్నిటికన్నా ఇంపార్టెంట్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయదు అంటూ నయనతార చేయాల్సిన బిగ్ బడా లేడీ ఓరియంటెడ్ ఫిలిం ని సాయి పల్లవి ఖాతాలో వేసుకునిందట. దీంతో సోషల్ మీడియాలో కోలీవుడ్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది.