
పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ నెగిటివిటి ఫేస్ చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఉండాలి . దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది . కానీ లాస్ట్ మినిట్ లో ఇదంతా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది . ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమాల విషయంలో బిజీగా ఉండడం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా విషయంలో అసలు ఇంట్రెస్ట్ చూపించకపోవడం .. బాలయ్య చెప్పిన సజెషన్స్ ని తీసుకోకపోవడం .. బాలయ్యకు బాగా కోపం తెప్పించిందట .
అయినా సరే యంగ్ డైరెక్టర్ కదా రెండు మూడు అవకాశాలు ఇవ్వాలి అన్న కారణంగా బాలయ్య నెమ్మదిగానే ఉన్నారట . కానీ ప్రశాంత్ వర్మ మాత్రం బాలయ్య విషయాలను బాలయ్య సలహాలను అస్సలు పట్టించుకోవడంలేదట . మోక్షజ్ఞ ఎంట్రీ విషయం ఎన్నిసార్లు మాట్లాడుతున్నా సరే అస్సలు బాధ్యత లేకుండా సమాధానం చెప్తున్నారట. దీంతో మోక్షజ్ఞ సినిమా నుంచి ప్రశాంత్ వర్మ ని తప్పించిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలామంది స్టార్ డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు . బాలయ్య నమ్మి ఆ బాధ్యతలను ప్రశాంత్ వర్మ చేతుల్లో పెడితే ..ఇలా చేయడం నిజంగానే ఆయనకు టైం బ్యాడ్ అంటున్నారు జనాలు. బాలయ్యకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తాడు వెయిట్ అండ్ సీ అంటూ ఫ్యాన్స్ కూడా వార్నింగ్ ఇస్తున్నారు..!!