టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకుల మనసును దోచుకున్న చైల్డ్ ఆర్టిస్టులు చాలానే మంది ఉన్నారు. వారి అద్బుతమైన నటనతో మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వారి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వారి పేర్లను, ఫోటోస్ ని షేర్ చేస్తున్నారు. అమ్మాయిల విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్లే ఇప్పుడు ముఖ్య పాత్రలో హీరోయిన్ గా చాలా సినిమాలలో కనిపిస్తున్నారు. అలాగే అబ్బాయిలు కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా చేసి.. ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్నారు. ఇక తాజాగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో నేటింటా చాలా వైరల్ అవుతుంది. అయితే ఆ ఫోటో ఎవరిది.. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తున్నారా.
 
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించిన సినిమాలో ఈ బుడ్డోడు నటించాడు. అతనే చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్రన్. మహేంద్రన్ ఎన్నో సినిమాలలో నటించి హిట్ కొట్టాడు. ఇతను తన నటనతో ప్రేక్షకులను అలరించేవాడు. మహేంద్రన్ నటించిన సినిమాలన్ని హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలే. మహేంద్రన్ ఎవర్ గ్రీన్ సినిమా అయిన దేవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ప్రేమ ముఖ్యపాత్రలో నటించారు. దేవి సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మహేంద్రన్ దేవి సినిమాలో ఒక అమాయకమైన బాలుడిలా కనిపిస్తాడు.

 
ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేంద్రన్.. ఆ తర్వాత మోహన్ బాబు నటించిన పెద్దరాయుడు సినిమాలో కూడా అవకాశం కొట్టేశాడు. ఆ తర్వాత హీరో జగపతి బాబు నటించిన ఆహా మూవీలో కూడా నటించాడు. మహేంద్రన్ ఇటు తెలుగుతో పాటుగా అటు తమిళం, కన్నడ అలాగే ఇతర భాషలలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశాడు. ఈ బాలుడు దాదాపు 130కి పైగా సినిమాలలో నటించి అలరించాడు. ఇతను చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఇప్పుడు మాత్రం మహేంద్రన్ హీరోలకు పోటీగా నిలిచేలా ఉన్నాడు. ప్రస్తుతం మహేంద్రన్ కోలీవుడ్ లో తన సత్తా చాటుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: