అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఇండస్ట్రిలో ఎక్కువగా వినిపిస్తున్న డైరెక్టర్ పేరు . రాజమౌళి - ప్రశాంత్ నీల్ - ప్రశాంత్ వర్మ - సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ లు ఇండస్ట్రీలో బడా బడా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా వాళ్ల పేర్లు కన్నా కూడా ఎక్కువగా ట్రెండ్ అయ్యే పేరు మాత్రం అనిల్ రావిపూడి అని చెప్పాలి.  ఆయన సినిమా తెరకెక్కిస్తే సూపర్ డూపర్ హిట్ ..లో బడ్జెట్ హై కలెక్షన్స్ ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు జనాలు . అది నిజమే . రీసెంట్ గా అనిల్ రావిపూడి కి తెరకెక్కించిన సినిమాలు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి .


మరీ ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.  సూపర్ డూపర్ హిట్ . ఇప్పుడు చిరంజీవితో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. సెట్స్ పై కి కూడా తీసుకొచ్చేసాడు . కాగా బాలయ్యతో ఆల్రెడీ "భగవంత్ కేసరి" సినిమా చేశాడు. వెంకటేష్ తో వరుసగా ఎఫ్2 , ఎఫ్3 , సంక్రాంతికి వస్తున్నాం లాంటి మంచి సినిమాలు చేశాడు. ఇప్పుడు చిరంజీవి తరువాత నెక్స్ట్ అనిల్ రావిపూడి వర్క్ చేసే హీరో ఎవరు..?? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.



సీనియర్ హీరోల విధంగా వెళ్లితే లిస్టులో  నెక్స్ట్ అక్కినేని నాగార్జున ఆ ఖాతాలో ఉంటాడు అని ..లేదు రూట్ మార్చి స్టార్ హీరోల తో సినిమాను ఓకే చేయాలి అనుకుంటే "నాని" ఆ లిస్టులో ఉంటాడు అని మాట్లాడుకుంటున్నారు.  ఏది ఏమైనా అనిల్ రావిపూడి - నాని కాంబినేషన్ బాగుంటుంది . అనిల్ రావిపూడి - నాగార్జున కాంబో బాగుంటుంది.  ఆ మాటకి వస్తే అనిల్ రావిపూడిసినిమా తెరకెక్కించిన బాగుంటుంది అంటున్నారు అభిమానులు. ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడంటే నిజంగానే అనిల్ రావిపూడి గ్రేట్ అంటున్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: