
అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక కూడా పూర్తయిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. జంజీర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నటించిన ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్గా నటించనున్నారని తెలుస్తుంది. ప్రియాంక చోప్రా వరుసగా సౌత్ ప్రాజెక్టులతో బిజీ అవుతుండడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తను హీరోగా తెరకెక్కే ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకే సమయంలో రెండు సినిమాలలో నటించాలని భావిస్తున్న బన్నీ ఈ సినిమాల లుక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. బన్నీ భవిష్యత్తు సినిమాలలో బాలీవుడ్ హీరోయిన్లు నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బన్నీ త్రివిక్రమ్ భవిష్యత్తు సినిమాపై అంచనాలు పెరుగుతుండగా మైథిలాజికల్ టచ్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. హారిక హాసిని బ్యానర్ గీత ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా క్రేజీ అప్డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తుంది. అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాలు పూర్తైన తర్వాత బన్నీ పుష్ప3 సినిమాలో నటించనున్నారు. సూపర్ స్టార్ అల్లు అర్జున్ లైనప్ అదిరిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బన్నీ సైతం సినిమాల ఎంపికలో ఒకింత ఆచితూచి అడుగులు వేస్తున్నారు