
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసే మాటలు, పంచ్‌లు, ప్రాసలు.. డైలాగులు ఏ స్థాయిలో పేలుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్ డైలాగులు అంటేనే థియేటర్లలో విజిల్స్ హోరెత్తిపోతాయి. ఎమోషన్.. యాక్షన్ .. కామెడీ ఇలా ఎందులో అయినా త్రివిక్రమ్ డైలాగులు ఆలోచింప జేసేలా ఉంటాయి. త్రివిక్రమ్ టాప్ ప్రాసలు.. పంచ్‌లు బాగా పేలినవి కొన్ని చూద్దాం.
* యుద్ధం చేసే సత్తా లేని వాడికి.. శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు.
* వీరా.. నువ్ కత్తి పట్టినట్టు లేదురా.. అది నీ చేతికి మొలిచినట్టు ఉందిరా..
* కొండను చూసి కుక్క మొరిగితే కుక్కకి చేటా? తగ్గితే తప్పేంటి?
* మాట్లాడితే మా వాళ్లే కాదు.. శత్రువులు కూడా వింటారు.
* వందడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసేవాడిని ఏమంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.
* ఈ వయసులో నాకు కావాల్సింది నిజాలు, అబద్ధాలు కాదు జ్ఞాపకాలు.
* కారులో ముందు సీటుకి, వెనక సీటుకి దూరం ఎవరూ తగ్గించలేరు.
* దూరం నుంచి చూస్తే భూమి, ఆకాశం కలిసినట్టు కనిపిస్తాయి. కానీ అది అబద్ధం. ఈ ఔట్ హౌస్ నుంచి చూస్తే వాళ్ల బంగ్లా చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. అది కూడా అబద్ధమే.
* లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కునే అశాంతి పెళ్లి.
* భయపడే వాడు ప్రేమించకూడదు .. పేమించేవాడు భయపడకూడదు .. రెండు చేస్తే బాధ పడకూడదు.
* నువ్వు తలెత్తుకుంటే అందరు నిన్ను చూడడానికి నీ తల ఏమి జాతీయ జండా కాదు.
* అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది.. దురదృష్టము తీసే దాకా తలుపు తడుతుంది.
* అమ్మ, ఆవకాయ్, అంజలి మూడు ఎప్పుడు బోర్ కొట్టావు.
* ఉప్పు తింటే బీపీ, చక్కర తింటే షుగర్, కారము తింటే అల్సర్.. సరిగ్గా అన్నం తింటే చచ్చిపోతావు.. నీకెందుకు రా ఆస్తి..
* దేవుడైన రాముడు కూడా వాలిని చెట్టు చాటు నుంచే చంపాడు, ముందు నుంచి చంపడం చేతకాక కాదు, కుదరక.
* అద్భుతం జరిగేటపుడు ఎవరు గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు.
* కారణం లేని కోపం , గౌరవం లేని ఇష్టం , బాధ్యత లేని యవ్వనం , జ్ఞాపకం లేని వృద్దాప్యం.. అలాంటి వాడు ఉన్న లేకపోయినా ఒకటే.
* మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి, బాలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు.
* లవ్ చేసే అంత లగ్జరీ లేదు, వదిలేసే అంత లెవెల్ లేదు.
* జీవితంలో మనము కోరుకునే ప్రతి సౌకర్యం వెనుక ఒక మినీ యుద్ధం ఉంది.