- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


మన టాలీవుడ్ ఆడియెన్స్ మర్చిపోలేని కొన్ని సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన సినిమా అజ్ఞాత‌వాసి. ఇది వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో మూడో సినిమా. అంత‌కు ముందు వీరిద్ద‌రి కాంబోలో జ‌ల్సా - అత్తారింటికి దారేది రెండు సినిమాలు వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక 2018 సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన మూడో సినిమా అజ్ఞాత‌వాసి. ఆ సంక్రాంతికి భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమా దెబ్బ‌కు ప‌వ‌న్ ప‌రువు తో పాటు త్రివిక్ర‌మ్ ప‌రువు కూడా పోయింది. ఎన్నో తీపి జ్ఞాప‌కాలు ఈ సినిమా మిగులుస్తుంది అనుకుంటే ఎన్నో చేదు జ్ఞాప‌కాలు మిగిల్చింది. ఇక ప‌వ‌న్ న‌టించిన గ‌త సినిమాల‌ను ఇప్పుడు ఈ టైటిల్స్ వాడుకుని మ‌ళ్లీ సినిమాలు చేస్తున్నారు. ప‌వ‌న్ త‌మ్ముడు సినిమా టైటిల్‌నే ఇప్పుడు నితిన్ వాడుకుని త‌మ్ముడు సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.


ఇక ఇప్పుడు అజ్ఞాత‌వాసి సినిమా టైటిల్ తో మ‌రో సినిమా వ‌స్తోంది. ఆల్రెడీ ఒకసారి వచ్చిన అజ్ఞాతవాసి మళ్ళీ ఇపుడు ట్రెండ్ అవ్వడం చూసి ఒకింత పవన్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో షాక్ అవుతున్నారు. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత వాసి కాదు .. ఈ టైటిల్‌తో వ‌స్తోన్న సినిమా మ‌న సౌత్ నుంచే కావ‌డం విశేషం. ఈ సారి క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీ నుంచి అజ్ఞాత‌వాసి సినిమా వ‌స్తోంది. కన్నడ సినిమా నుంచి అజ్ఞాతవాసి గా ఓ యూత్ ఫుల్ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ కి రాగా మళ్ళీ ఈ టైటిల్ వైరల్ గా మారింది. దీంతో ప‌వ‌న్‌ అజ్ఞాతవాసి వేరు ఈ అజ్ఞాతవాసి వేరు అని అంద‌రికి క్లారిటీ వ‌చ్చింది.  మ‌రి ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి డిజాస్ట‌ర్ అవ్వ‌గా .. ఈ సినిమా ఏం చేస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: