
వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ సినిమా చిరంజీవికి ఇచ్చారు దర్శకుడు బాబి. ఈ సినిమా సక్సెస్ అయ్యాక బాలయ్య కు ఈ సంక్రాంతికి డాకూ మహారాజ్ లాంటి మరో సూపర్ హిట్ ఇచ్చారు. ఆ మాటకు వస్తే బాబి కెరీర్ లో పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా మినహా అన్ని సూపర్ హిట్ సినిమాలే. బాబి అంటేనే కమర్షియల్ హిట్ సినిమాలకు మారు పేరు. ఇక చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 హిట్ అయినా అది రీమేక్ సినిమా.. తర్వాత అన్ని సినిమాలు ప్లాప్ లే .. ఒక్క వాల్తేరు వీరయ్య సినిమా మాత్రమే డైరెక్టు కథతో తెరకెక్కి హిట్ అయ్యింది. ఈ సినిమా రు. 150 కోట్ల కు పై గా వసూళ్లు రాబట్టింది.
అయితే ఇప్పుడు బాబి మెగాస్టార్ తోనే మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. చిరు కూడా తనకు వాల్తేరు వీరయ్య లాంటి హిట్ సినిమా ఇవ్వడంతో బాబి తో సినిమాకు ఓకే చెప్పేశారు. చిరు ప్రస్తుతం మల్లిడి వశిష్ట్ దర్శకత్వం లో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాబి సినిమా ఉండొచ్చు. కానీ వాల్తేరు వీరయ్య లాంటి హిట్ సినిమా కాంబినేషన్ .. పైగా బాబి వరుస హిట్లతో ఫామ్ లో ఉన్నాడు. కానీ ఇలాంటి కాంబినేషన్ లో సినిమా కు నిర్మాతలు ఎవ్వరూ లేరు. అసలు నిర్మాతలు ఈ సినిమాకు ఎవ్వరూ కనపడడం లేదట. పెద్ద పెద్ద నిర్మాతలు ఎవ్వరు కూడా అస్సలు ఈ కాంబినేషన్ లో సినిమా చేసే విషయంలో ఆసక్తి గా లేరని అంటున్నారు. ఏదేమైనా ఇది చాలా షాకే అనుకోవాలి.