టాలీవుడ్ ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపున సంపాదించుకున్న వారిలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన చాలా కాలం క్రితం పవన్ కళ్యాణ్ హీరో గా ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. కానీ పవన్ కళ్యాణ్ ఈ సినిమాను మొదలు పెట్టిన తర్వాత రాజకీయాలతో ఫుల్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దానితో హరీష్ శంకర్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ ని కాస్త పక్కన పెట్టి రవితేజ తో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను రూపొందించాడు. మిస్టర్ బచ్చన్ మూవీ ని హిందీ సినిమా అయినటువంటి రైడ్ మూవీ కి రీమిక్ గా రూపొందించారు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన మిస్టర్ బచ్చన్ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం హరీష్ శంకర్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ తో పాటు మరో మూడు బ్యానర్ లలో సినిమాలకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. పవన్ కళ్యాణ్ ఫ్రీ కాగానే జెట్ స్పీడ్ లో ఈ సినిమాను కంప్లీట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక KVN ప్రొడక్షన్స్ బ్యానర్ లో కూడా హరిష్ శంకర్మూవీ కి కమిట్ అయినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ బ్యానర్ లో హరిష్ శంకర్ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో కూడా ఓ సినిమా చేయడానికి హరిష్ శంకర్ కమిట్ అయినట్లు సమాచారం. ఇకపోతే మైత్రి సంస్థలో కూడా హరిష్ శంకర్మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరో గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని స్టార్ట్ చేసిన హరిష్ శంకర్ మరో మూడు బ్యానర్లలో సినిమాలకు కమిట్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: