
డైరెక్టర్ గా నటుడుగా కూడా ఎన్నో చిత్రాలలో నటించిన మనోజ్ కుమార్.. మనోజ్ కుమార్ ను ముద్దుగా భరత్ కుమార్ అని కూడా పిలుస్తూ ఉంటారట. దోబదన్, పత్తర్ కే సనమ్, క్రాంతి, నీల్ కమల్ వంటి విజయవంతమైన చిత్రాలలో కూడా డైరెక్టర్గా తెరకెక్కించారు. భారతీయ సినిమాకు గాను సేవలను మెచ్చి 1992లో పద్మశ్రీ అవార్డు కూడా వరించింది. అలా 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు మనోజ్ కుమార్. తన తండ్రి వార్తను కునాల్ గోస్వామి అధికారికంగా ధ్రువీకరించారు. ఈ విషయం తెలిసి చాలామంది సినీ సెలబ్రిటీలే కాకుండా అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
కునాల్ గోస్వామి ఇలా తెలియజేస్తూ తన తండ్రి గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఈ ప్రపంచానికి ప్రశాంతంగా వీడ్కోలు పలికారు అంట తెలిపారు ఈ రోజున ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కొనాల్ గోస్వామి తెలియజేశారు. ఇలాంటి డైరెక్టర్ నటుడు మరణంతో చాలామంది ఇది సిని పరిశ్రమకు తీవ్రమైన నష్టం వంటిది ఇలాంటి నటుడును డైరెక్టర్ను సినీ పరిశ్రమ మొత్తం మిస్ అవుతోంది అంటు చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా వయోభారంతో ఇబ్బంది పడుతూ ఈయన మరణించినట్లుగా తెలుస్తోంది.