టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన మీడి యం రేంజ్ హీరోలలో నితిన్ , రామ్ పోతినేని కూడా ఉంటారు. వీరిద్ద రూ చాలా సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టారు . నితిన్ "జయం" అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు . ఆ తర్వాత కూడా ఈయన చాలా విజయాలను అందుకొని అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు. ఇకపోతే రామ్ పోతినేని , వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాస్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఈయన కూడా ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా వీరిద్దరూ కెరియర్ను మొదలు పెట్టిన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని ఆ తర్వాత కూడా చాలా విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో మంచి స్థాయికి చేరుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం వీరిద్దరూ వరుస పెట్టి అపజయాలను అందుకుంటున్నారు.

రామ్ పోతినేని ఆఖరుగా నటించిన ది వారియర్ , స్కంద , డబల్ ఇస్మార్ట్ మూడు సినిమాలతో ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు. ఇక నితిన్ ఆఖరుగా నటించిన మాచర్ల నియోజకవర్గం , ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలతో ఫ్లాప్ లను అందుకున్నాడు. తాజాగా ఈయన రాబిన్ హుడ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. ఇలా వీరిద్దరూ ప్రస్తుతం వరస అపజయాలతో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: