
తారక్ , సమంత కాంబినేషన్లో మొదటగా బృందావనం అనే సినిమా వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో సమంత తో పాటు కాజల్ అగర్వాల్ కూడా హీరోయిన్గా నటించింది. వీరిద్దరి కాంబినేషన్లో బృందావనం సినిమా తర్వాత రామయ్య వస్తావయ్య అనే సినిమా వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఈ సినిమాలో సమంత తో పాటు శృతి హాసన్ కూడా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తర్వాత తారక్ , సమంత కాంబినేషన్లో రభస అనే మూవీ వచ్చింది. ఈ మూవీ కి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో సమంత తో పాటు ప్రణీత కూడా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తర్వాత తారక్ , సమంత కాంబినేషన్లో జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సమంత తో పాటు నిత్య మీనన్ కూడా హీరోయిన్గా నటించింది. ఇలా ఇప్పటి వరకు తారక్ , సమంత కాంబినేషన్లో వచ్చిన ఈ నాలుగు సినిమాల్లో సమంత తో పాటు మరో హీరోయిన్ కూడా నటించింది. ఇదే వీరి కాంబోలో వచ్చిన అన్ని సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్.