రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో అద్భుతమైన విజయాలు అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగించడం మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రభాస్ ఇప్పటి వరకు తన కెరీర్లో చాలా మంది హీరోయిన్లతో ఆడి పాడాడు. ఇక ప్రభాస్ ఒక ముద్దుగుమ్మతో రెండు సినిమాల్లో నటిస్తే ఆ రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. అలా ప్రభాస్ కి అద్భుతమైన రీతిలో కలిసి వచ్చిన ఆ హీరోయిన్ ఎవరు అనేది తెలుసుకుందాం.

ప్రభాస్ కు సూపర్ గా కలిసి వచ్చిన ముద్దుగుమ్మలలో కాజల్ అగర్వాల్ మొదటి స్థానంలో ఉంటుంది. ప్రభాస్ , కాజల్ కాంబినేషన్లో మొదటగా డార్లింగ్ అనే సినిమా వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని ప్రభాస్ , కాజల్ జంటకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని ప్రభాస్ , కాజల్ జంటకు కూడా మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి. ఇలా ఇప్పటి వరకు ప్రభాస్ , కాజల్ కాంబినేషన్లో కేవలం రెండు సినిమాలు మాత్రమే రాగా , ఆ రెండు మూవీ లు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే ఆ రెండు మూవీలలో ప్రభాస్ , కాజల్ జంటకు కూడా మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: