టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆఖరుగా నా సామి రంగ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత నాగార్జున సోలో హీరోగా ఏ మూవీ ని కూడా ఓకే చేయలేదు. ప్రస్తుతం నాగార్జున , శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న కుబేర మూవీలోనూ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న కూలీ మూవీ లోనూ కీలక పాత్రలలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నాగార్జున ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించి ఎంతో మంది హీరోయిన్లతో ఆడి పాడాడు.

కానీ ఇప్పటి వరకు నాగార్జున , కాజల్ అగర్వాల్ కాంబోలో మాత్రం సినిమా రాలేదు. కానీ వీరిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున "రగడ" మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క , ప్రియమణి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ లో ప్రియమణి స్థానంలో మొదట ఈ మూవీ బృందం వారు కాజల్ ను తీసుకోవాలి అని అనుకున్నారట.

కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదట. ఇక నాగార్జున కొంత కాలం క్రితం ది ఘోస్ట్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో కాజల్ ను హీరోయిన్గా తీసుకోవాలి అని మేకర్స్ మొదట ఫిక్స్ అయ్యారట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చివరగా ఈ సినిమాలో కాజల్ ను కాకుండా సోనాల్ చౌహాన్ ను హీరోయిన్గా తీసుకున్నారట. అలా ఇప్పటికి రెండు సార్లు నాగార్జున , కాజల్ అగర్వాల్ కాంబోలో సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: