టైటిల్ చూస్తేనే చాలా డిఫరెంట్ గా ఉంది.. ఇదేంటి కీర్తి సురేష్ తప్పించుకోవడం ఏంటి? నభా నటేష్ ఇరుక్కోవడం ఏంటి అని ఈ టైటిల్ చూసిన చాలా మందిలో కొన్ని అనుమానాలు అయితే ఉంటాయి. అయితే కీర్తి సురేష్ తప్పించుకుంది ఏదో కాదు ఓ సినిమాలో.. మరి ఆ సినిమా ఏంటంటే..  నితిన్ హీరోగా చేసిన మాస్ట్రో మూవీలో నభా నటేష్ హీరోయిన్ గా తమన్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది . అయితే నితిన్ మాస్ట్రో మూవీలో మొదట హీరోయిన్ ఛాన్స్ కీర్తి సురేష్ కే వచ్చిందట.కానీ ఈ సినిమాలో లిప్ లాక్ ఉన్న కారణంగా కీర్తి సురేష్మూవీ ని రిజెక్ట్ చేయడంతో ఆ ప్లేస్ లో  నభా నటేష్ ఇరుక్కుంది.అలా నితిన్ తో నభా నటేష్ ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ చేసిన సంగతి మనకు తెలిసిందే. 

అయితే ఈ సినిమా వదులుకోవడం ఒకందుకు కీర్తి సురేష్ కి మంచిదే. ఎందుకంటే ఈ సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. అంత హిట్ ఏమీ కాలేదు. అయితే మాస్ట్రో మూవీ కంటే ముందే నితిన్ కీర్తి సురేష్ కాంబోలో రంగ్ దే మూవీ వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో వీరి కాంబో బాగుండడంతో మాస్ట్రో మూవీలో కూడా తీసుకున్నప్పటికీ అందులో లిప్ లాక్ ఉండడంతో కీర్తి సురేష్ రిజెక్ట్ చేసిందట.ఇదిలా ఉంటే ఈ మధ్యనే బాలీవుడ్ లో బేబీ జాన్ మూవీ లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఓ భారీ ప్రాజెక్టులో కూడా హీరోయిన్ ఛాన్స్ అందుకున్నట్టు బీ టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఇదే నిజమైతే కీర్తి సురేష్ కి బాలీవుడ్ లో మంచి అవకాశాలు వచ్చినట్టే.. ఎప్పుడైతే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి కీర్తి సురేష్ బోల్డ్ లుక్ లో కనిపిస్తోంది. ఈ హీరోయిన్ ఒకప్పుడు గ్లామర్ కి ఆమడ దూరంలో ఉండేది.కానీ బాలీవుడ్ మూవీలో ఈ హీరోయిన్ కూడా తన గ్లామర్ ని ఒలకబోసింది.ముఖ్యంగా గ్లామర్ గా నటిస్తేనే సినిమాల్లో అవకాశాలు ఉంటాయి అని అర్థం చేసుకుందో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ పొట్టి బట్టలు వేసుకుంటుంది.పెళ్లయిన సరే తగ్గేదేలే అన్నట్లు కీర్తి సురేష్ బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: