
కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇడియట్ అనే సినిమాలో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే మొదట పూరి జగన్నాథ్ ఈ సినిమాను రవితేజతో కాకుండా పవన్ కళ్యాణ్ తో చేయాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కు కథను వినిపించగా ఆయన మాత్రం ఈ సినిమాలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదట. దానితో పూరి జగన్నాథ్ , రవితేజకు ఈ మూవీ కథను వినిపించగా ఆయన మాత్రం ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాను కూడా పూరి జగన్నాథ్ మొదట రవితేజతో కాకుండా పవన్ కళ్యాణ్ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా పవన్ కు కథను కూడా వినిపించాడట. పవన్ మాత్రం ఈ కథతో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదట. దానితో ఇదే కథను పూరి జగన్నాథ్ , రవితేజకు వినిపించగా ఆయన ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇలా పవన్ రిజెక్ట్ చేసిన రెండు సినిమాలతో రవితేజ అద్భుతమైన విజయాలను అందుకున్నట్లు తెలుస్తోంది.