బాల నటిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వాని ఆ తర్వాత కొద్ది రోజులకే హీరోయిన్ గా మారడంతో ఆమె కటౌట్ ని చూసి చాలా మంది షాక్ అయ్యారు. ముఖ్యంగా హన్సిక మోత్వాని అంత తొందరగా పెద్దవ్వడంపై చాలానే విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాదు హన్సిక మోత్వాని తొందరగా పెరగడం కోసం ఆమెకు హార్మోన్లు ఇంజక్షన్ చేశారని, హీరోయిన్ ని చేయడం కోసమే తల్లిదండ్రులు హన్సిక మోత్వాని కి అలాంటి హార్మోన్ ఇంజక్షన్లు వేయించి డబ్బు మీద కకృత్తి తో అలా చేశారు అంటూ ఎన్నో రూమర్లు వినిపించాయి. అయితే హార్మోన్ లు ఇంజెక్ట్ చేయడంపై హన్సిక మోత్వాని తో పాటు ఆమె తల్లి కూడా క్లారిటీ ఇచ్చింది. 

ఎలాంటి హార్మోన్స్ ఇంజెక్ట్ చేయించుకోలేదని తేల్చి చెప్పారు. కానీ అంత చిన్నగా ఉన్న అమ్మాయి అంత తొందరగా ఎలా పెరిగింది అనే అనుమానం చాలా మందిలో అయితే ఉంది. ఈ విషయం పక్కన పెడితే హీరోయిన్ల కు కూడా కొంత మంది హీరోలు అంటే క్రష్ ఉంటుంది.అలా హన్సిక మోత్వాని కి కూడా ఓ హీరో అంటే చాలా ఇష్టమట. ఆయన ఎవరో కాదు మలయాళం హీరో మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్..

 సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో ఎంతోమందికి ఫేవరెట్ హీరోగా మారిపోయిన దుల్కర్ సల్మాన్ అంటే హన్సిక మోత్వాని కి చెప్పలేనంత ఇష్టమట. అయితే ఈ విషయాన్ని స్వయంగా హన్సిక  మోత్వానిఓ ఇంటర్వ్యూ లో నా ఫేవరెట్ హీరో దుల్కర్ సల్మాన్ అంటూ చాలా ఇష్టంగా చెప్పింది. ఇక తాజాగా హన్సిక గృహ హింస కేసు కింద కోర్టుకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. తన సోదరుడి భార్య తనపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టడంతో కోర్టు మెట్లు ఎక్కింది హన్సిక.

మరింత సమాచారం తెలుసుకోండి: