సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ య‌వేటేడ్ మూవీ కూలి ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమా పై ఊహించని అంచనాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే .. అయితే ఈ సినిమా ను వ‌రుస‌ విజయాలతో దూసుకుపోతున్న లోకేష్ కనగరాజ్ డైరెక్ట చేస్తుండగా పూర్తి య‌క్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది .. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర‌ యూనిట్ రెడీ అవుతుంది .. అలాగే ఈ సినిమా కొత్త అప్డేట్ ను ఏప్రిల్ 4న అనగా ఈరోజు ప్రేక్షకులకు అందించబోతున్నట్లు చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది .


ఇక దీంతో ఈ అప్డేట్ ఏమై ఉంటుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా  ఎదురుచూస్తున్నారు .. కాగ‌ ఈ సినిమా లో ఉపేంద్ర , అక్కినేని నాగార్జున , శృతిహాసన్ , సత్యరాజ్  వంటి కీలక నటులు ఎంతో ముఖ్యమైన పాత్రలు నటిస్తున్నారు.   అలాగే ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్ సినిమాని నిర్మిస్తున్నారు .. లోకేష్ కూడా తన LCU లో భాగంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు .  ఇప్పటికే తన LCU లో  ఖైదీ , విక్రమ్ , లియో వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతో సర్ప్రైజ్ చేశాడు .. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలి సినిమా చేస్తున్నాడు ..


 ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఊహించని రేంజ్ లో ఉంటుందని కూడా ఇప్పటికే వస్తున్న పోస్టర్స్ , టీజర్లతోనే లోకేష్ చెప్పేస్తున్నాడు.   అలాగే రజినీకాంత్ ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించని కొత్త లుక్ లో కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని కూడా అర్థమవుతుంది .  నాగార్జున , ఉపేంద్ర వంటి అగ్ర నటులు ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తున్నారు అనే దానిపై కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు .. అయితే మాత్రం ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతుందని చెప్పటంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: