టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటు  వంటి రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకత్వం వహించిన ప్రతి మూవీతో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రపంచ వ్యాప్తంగా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇక పోతే రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించబోతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ తన తదుపరి మూవీ ని టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఏప్రిల్ 8 వ తేదీన వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు బలంగా వస్తున్నాయి.

ఇకపోతే అల్లు అర్జున్ మూవీ కోసం అట్లీ , రాజమౌళిని ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. అది ఏ విషయంలో అనుకుంటున్నారా ..? హీరోయిన్ విషయంలో... అసలు విషయం లోకి వెళితే ... అట్లీ , బన్నీ తో చేయబోయే సినిమాలో ప్రియాంక చోప్రా ను హీరోయిన్గా తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్లు , అందులో భాగంగా ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు అన్ని ఓకే అయితే బన్నీ , అట్లీ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కనిపించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: