ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ దగ్గర ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంట్ దర్శకుల్లో తన సినిమాటిక్ యూనివర్స్ ని పరిచయం చేసిన తెలుగు ఆడియన్స్ కి థియేటర్లో క్రేజీ ఎక్స్పీరియన్స్ అందించిన వారిలో యంగ్‌ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా ఒకరు .. ఇక శైలాష్ నుంచి తన హిట్ ఫ్రాంచేజీలో మూడో సినిమా కూడా రాబోతుంది .. నాచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమా పై టాలీవుడ్ బాక్సాఫీ దగ్గర భారీ అంచనాలు నెలకొన్నయి .. అయితే ఈ సినిమాలో మరో స్టార్ హీరో క్లైమాక్స్లో కనిపిస్తారని టాక్ ఓ రేంజ్ లో వైరల్ గా మారింది .. అయితే ఈ సినిమాలో ఆ హీరో ఉన్నాడు అని లీక్ విషయంలో దర్శకుడు బాగా డిసప్పాయింట్ అయ్యాడు ...


తాను తన టీం ఎప్పుడు ఆడియన్స్ కు మంచి ట్రీట్ ఇవ్వాలని అనుకుంటాము అని కానీ దానిని కొంతమంది ముందే ఇలా లీక్ చేసేసి వాటిని చెడగొడుతున్నారు అన్నట్టు దర్శకుడు శైలేష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ..కనీసం ఆలోచన కూడా లేకుండా పోస్ట్ చేయటం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ తరహా రిపోర్టింగ్ కేవలం చిత్ర బంధం కష్టాన్ని దొంగలించడమే కాదు ప్రేక్షకుల నుంచి నేరుగా దొంగలించడంతో సమానమంటూ శైలేష్ చేసిన పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది .. ఇక మరి హిట్ 3 సినిమాతో నానికి ఈ దర్శకుడు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి .. ఇప్పటికే శైలేష్ వెంకటేష్ తో చేసిన సైంధవ్‌ సినిమా భారీగా డిసప్పాయింట్ చేసింది .  ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నానితో హిట్‌ 3 చేస్తున్నాడు .. ఈ సినిమాతో మాత్రం సరైన హిట్ కొడితే ఈ దర్శకుడికి టాలీవుడ్ లో మరింత అవకాశాలు వస్తాయి లేకపోతే .  రాబోయే రోజులు కష్టమనే చెప్పాలి ..




మరింత సమాచారం తెలుసుకోండి: