టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో చాలా సినిమాలను వదిలేశాడు. అందులో కొన్ని మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. మరి చిరు వదిలేసిన సినిమాలలో అద్భుతమైన విజయాలను అందుకున్న సినిమాలు ఏవి ..? ఏ కారణాలతో ఆ మూవీలను చిరంజీవి వదిలేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.

చాలా సంవత్సరాల క్రితం కోడి రామకృష్ణ , అర్జున్ హీరోగా మన్యంలో మొనగాడు అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే మొదట ఈ సినిమాను కోడి రామకృష్ణ , అర్జున్ తో కాకుండా చిరంజీవితో చేయాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా ఈ మూవీ కథను కూడా చిరంజీవికి వినిపించాడట. కథ మొత్తం విన్నాక చిరంజీవి స్టోరీ సూపర్ గా ఉంది. కానీ నాపై ఈ స్టోరీ వర్కౌట్ కాదు. వేరే హీరోతో తీయండి మంచి హిట్ అవుతుంది అని సలహా ఇచ్చాడట. ఆ సలహాతో ఆ మూవీ కథను అర్జున్ కు వినిపించగా ఆయన ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ఇకపోతే కొన్ని సంవత్సరాలు క్రితం నాగార్జున హీరోగా రాఘవేందర్రావు దర్శకత్వంలో ఆఖరి పోరాటం అనే మూవీ వచ్చి మంచి సక్సెస్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మొదట రాఘవేంద్రరావు , నాగార్జునతో కాకుండా చిరంజీవితో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా చిరంజీవికి కథను కూడా వినిపించగా కథ మొత్తం విన్న చిరు ఓకే చేద్దాం అని చెప్పాడట. ఇక అంతా ఓకే అయ్యి షూటింగ్ స్టార్ట్ చేసే సమయానికి చిరంజీవి ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఇప్పుడు నేను ఆ సినిమా చేయలేను అని చిరు ఈ మూవీ బృందానికి చెప్పాడట. దానితో రాఘవేంద్రరావు ఆ మూవీ కథను నాగార్జునకు వినిపించగా నాగార్జున ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

చిరంజీవి అలా మంచి విజయాలు సాధించిన మన్యంలో మొనగాడు , ఆఖరి పోరాటం అనే రెండు సినిమాలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: