ప్రభాస్ అంటే పడి చచ్చిపోయే జనాలు ఉన్నారు .. అమ్మాయిలు ఉన్నారు .. హీరోయిన్స్ ఉన్నారు . కానీ ప్రభాస్ ఒక హీరోయిన్ ని  ఇంత పిచ్చిగా ప్రేమించాడా ..? ఇంత పిచ్చిగా ఇష్టపడ్డాడా ..? అని జనాలు మాట్లాడుకుంటున్నారు. . స్వయాన ఈ విషయాన్ని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టడం ఇంకా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ ఆరడుగుల అందగాడు . ఓ రెబల్ హీరో.  పాన్ ఇండియా హీరో.  ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్న అస్సలు తనివి తీరదు.


ప్రభాస్ ప్రెసెంట్ ఫుల్ బడాబడా సినిమాలలో బిజీగా ఉన్నాడు . హనురాఘ పూడి దర్శకత్వంలో "ఫౌజీ".. మారుతి దర్శకత్వంలో "రాజా సాబ్".. ప్రశాంత్ నీల్ దర్శకత్వలో సలార్ 2..నాగ్ అశ్వీన్ డైరెక్షన్ లో "కల్కి2" ..ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో .. బిజీ బిజీగా ఆయన కాల్ షీట్స్ ఫిల్ అయిపోయాయి . అలాంటి ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది . ప్రభాస్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ తో ఎంత జోవియల్ గా ఉంటాడో .. ఎంత లిమిట్స్ లో ఉంటాడో అందరికీ తెలుసు.



ఈ రెబల్ హీరో ప్రభాస్ .. ఒక హీరోయిన్ ని పిచ్చిపిచ్చిగా ఇష్టపడ్డాడట . పిచ్చిపిచ్చిగా లైక్ చేశారట . ఆమె ఫొటోస్ పేపర్ లో వస్తే కట్ చేసి మరి బుక్స్ లో దాచుకున్నాడట.  ఆ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ బ్యూటీ "భాగ్యశ్రీ". రాధే శ్యామ్  సినిమాలో ప్రభాస్ కి తల్లి పాత్రలో కనిపించింది భాగ్యశ్రీ అంటే ప్రభాస్ కి చాలా చాలా ఇష్టమట. ఆమెను చిన్నప్పటినుంచి చాలా ఇష్టపడుతూ లైక్ చేసేవాడట . ఆమె నటించిన సినిమాలు ఎక్కువగా చూసేవాడట.  ప్రభాస్ కి భాగ్యశ్రీ అంటే ఒక పిచ్చిలా ఉండిపోయేవాడట . ఈ విషయాన్ని స్వయాన ప్రభాస్ నే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: