న్యాచురల్ స్టార్ నాని ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి టాలెంట్ తో అంతకంతకూ ఎదుగుతున్న సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో నాని నటించిన హిట్3 మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో కార్తీ కనిపిస్తారని ఒక వార్త వైరల్ కాగా ఈ వార్తలపై డైరెక్టర్ శైలేష్ కొలను సీరియస్ అయ్యారనే సంగతి తెలిసిందే. హిట్3 సినిమా తర్వాత నాని ది ప్యారడైజ్ సినిమాలో నటించనున్నారు.
 
ది ప్యారడైజ్ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుందని తెలుస్తోంది. న్యాచురల్ స్టార్ నాని రెమ్యునరేషన్ 35 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. నాని భవిష్యత్తు సినిమాలతో నెక్స్ట్ లెవెల్ కు చేరుకోవడం సాధ్యమేనా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాని నెక్స్ట్ లెవెల్ రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.
 
న్యాచురల్ స్టార్ నాని భాషతో సంబంధం లేకుండా సంచలనాలను సృష్టించాలని ఈ హీరో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నాని కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం రికార్డులు క్రియేట్ చేయడం కష్టమేం కాదు. న్యాచురల్ స్టార్ నాని లక్ కూడా కలిసొస్తే కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. మల్టీస్టారర్ సినిమాల్లో ఛాన్స్ వస్తే నాని గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.
 
నాని టైర్1 హీరోల స్థాయికి చేరుకుంటే బాగుంటుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. నాని నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో రికార్డులు క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. నాని పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధిస్తే ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తారని కచ్చితంగా చెప్పవచ్చు. నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది. నాని అంతకంతకూ ఎదుగుతూ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: