
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు ప్రస్తుతం లైన్లో ఉన్నాయి. హరిహర వీరమల్లు - ఉస్తాద్ భగత్ సింగ్ - ఓజీ .. ఈ మూడు సినిమాలలో ముందుగా రిలీజ్ అయ్యే సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాను వాస్తవానికి మార్చి 28న రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే పవన్ కాల్ షీట్లు ఇవ్వకపోవడంతో షూటింగ్ ఆలస్యం అయింది. చివరికి హరిహర వీరమల్లు సినిమా మే 9న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితులలోనూ ఆ డేట్ కి రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు. కానీ ఇది సాధ్యమవుతుందా లేదా ?అన్నది రిలీజ్ వరకు గాని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు వాయిదా వేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ మరో నాలుగు రోజులు ఈ సినిమా కోసం డేట్లు ఇస్తే సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ఇప్పటివరకు ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా టీం నుంచి వచ్చిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మరో 12 నుంచి 15 రోజులు డేట్లు ఇస్తే కానీ హరిహర వీరమల్లు బ్యాలెన్స్ వర్క్ పూర్తి కాదని తెలుస్తోంది.
పవన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ అధినేత గాను అటు పిఠాపురం ఎమ్మెల్యేగాను .. ఉపముఖ్యమంత్రిగాను కీలకమైన మూడు శాఖలకు మంత్రిగాని కొనసాగుతున్నారు. పవన్ క్షణం తేరిక లేకుండా బిజీగా ఉన్నారు. కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాలకే పవన్ హాజరుకాని పరిస్థితి. ఇలాంటి టైంలో పవన్ 15 రోజులు లేట్లు ఇవ్వటం అంటే చాలా కష్టం. అందులోనూ వరుసగా 15 రోజులు డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. పవన్ 15 రోజులు డేట్లు ఇచ్చి షూటింగ్ మొత్తం పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికావడానికి 20 రోజులకు పైగానే పడుతుంది. ఇక రీ రికార్డింగ్ .. ఎడిటింగ్ .. మిక్సింగ్ లాంటి చాలా పనులు ఉంటాయి ఇవన్నీ చూస్తుంటే హరిహర వీరమల్లు సినిమా ఇప్పటిలో రిలీజ్ అయ్యే పరిస్థితిలు కనపడటం లేదు.