- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

చిత్ర పరిశ్రమ లో ఎప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాల కు మాత్రమే వస్తాయి .. ప్లాప్‌ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావు .. ఒకవేళ రిలీజ్ కి ముందు సీక్వెల్ ప్రకటించిన అప్పటికీ డిజాస్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత సీక్వెల్ ఆలోచన నుంచి నిర్మాతలు , దర్శకులు తప్పుకుంటారు .  అయితే ఇప్పుడు భారతీయుడు 3 పరిస్థితి మాత్రం వేరు .. భారతీయుడు 2 పెద్ద ప్లాప్‌ అయినా భారతీయుడు 3 చేయడానికి అంతా రెడీ అవుతున్నారు .. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు .. అయితే దీని కి కారణం పార్ట్ 3 షూటింగ్ చాలా వరకు పూర్తవటమే .. పార్ట్ 2 తో పాటే మూడో భాగం షూటింగ్ కూడా పూర్తి చేశారు .


ఇక గతం లో మేకర్స్ ఇచ్చిన ఓ సమాచారం ప్రకారం భారతీయుడు 3 షూటింగ్ దాదాపు 70% కంప్లీట్ అయింది .. సో మిగతా 30 శాతం షూటింగ్ పూర్తి చేస్తే సినిమా రెడీ అయినట్టే . అయితే ఇప్పుడు ఈ 30 % పూర్తి చేయడాని కి కూడా కండిషన్స్ పెట్టిన నిర్మాణ సంస్థ లైక ..  ఇప్పటికే పీకల్లోతు నష్టాలు కూరుకుపోయిన ఈ సంస్థ‌పై ఒకోనాక సమయంలో దివాలా తీసింది అనే పుకార్లు కూడా బయటకు వచ్చాయి .. ఇలా మొత్తాని కి మూడో భాగాన్ని వీలైనంత తక్కువ బడ్జెట్ లో పూర్తిచేసి విడుదల చేయాలని నిర్ణయించారు .. అలాగే శంకర్ ప్రతిపాదించిన ఓ ఖరీదైన పాటను కూడా పక్కన పెట్టినట్టు తెలుస్తుంది .. ఇక కమలహాసన్ ఈ సినిమా కు నెల రోజులు కాల్షీ ట్లు కేటాయించాల్సి ఉంది . ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఈ సినిమా రిలీజ్ పై ప్రకటన చేస్తారు  .

మరింత సమాచారం తెలుసుకోండి: