గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లేటెస్ట్ పాన్ ఇండియ‌ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో నటిస్తున్న మూవీ పెద్ది .. బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు .. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత చేసిన సినిమాలని బాక్స్ ఆఫీస్ దగ్గర వరసగా ప్రేక్షకులను మెగా అభిమానులను నిరాశ ప‌రిచాయి .. ముఖ్యంగా ఈ సంక్రాంతికి ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ భారీ షాక్ ఇచ్చింది .. ఈ సినిమా తో రామ్ చరణ్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు ..


రామ్ చరణ్ కూడా ఆ సినిమా ఇచ్చిన షాక్ నుంచి కోలుకుని బుచ్చిబాబుతో పెద్ది సినిమాను మొదలుపెట్టాడు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా చాలా వరకు పూర్తిగా వస్తుంది .  రీసెంట్ గానే చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా అది సినిమా పై అంచనాలు పెంచిగా ఇప్పుడు పెద్ది  గ్లింప్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ..ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ బుచ్చి బాబుకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఆయన భార్య ఉపాసన ఇచ్చిన ఓ డివోషనల్ సర్ప్రైజ్ ను బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేసుకుని తన ఆనందం వ్యక్తం చేశారు ..

హనుమాన్ పై పాధకులు అలాగే మరికొన్ని పుస్తకాలు బహుమతిగా పంపిన పిక్స్ ని షేర్ చేసుకొని బుచ్చిబాబు తన ఆనందం వ్యక్తం చేస్తున్నారు .. ఇక దీంతో ఈ పోస్ట్ సహా ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా .. వృద్ధి సినిమాస్ విరు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు .. అలాగే రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు .   స్పోర్ట్స్ డ్రామాగా వ‌స్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు సౌత్ అగ్ర‌ నటుడు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు.. ఇక మ‌రి రామ్ చరణ్ కు బుచ్చిబాబు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి .




మరింత సమాచారం తెలుసుకోండి: