
కానీ తెరకెక్కించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ . అఫ్ కోర్స్ రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు ఫ్లాప్ అవ్వలేదు. కానీ రాజమౌళి సినిమాలు అంత కల్పితంగా ఉంటాయి అని నిజాయితీగా ఉండవు అన్న నెగిటివ్ కామెంట్స్ ఎప్పటినుంచో వినిపిస్తూ వస్తుంది. కానీ ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తే మాత్రం నిజాన్ని నిజాయితీగా తెరకెక్కిస్తాడు అన్న కామెంట్స్ దక్కించుకుంటున్నాడు . ఇప్పటికే ఆ డైరెక్టర్ ఎవరు మీకు అర్థం అయిపోయింది అనుకుంటున్నాను. ఎస్ మీ గెస్సింగ్ కరెక్ట్. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ..
అర్జున్ రెడ్డి సినిమాతో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసిన "సందీప్ రెడ్డివంగా". "అర్జున్ రెడ్డి" నే అనుకుంటే అర్జున్ రెడ్డికి అమ్మ మొగుడు లాంటి సినిమాను తెరకెక్కించి "అనిమల్" మూవీ తో సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేశారు . ఇప్పుడు ప్రభాస్ ని పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నాడు. ప్రభాస్ - సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో "స్పిరిట్" అనే సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమాకి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ రిలీజ్ అయినా లీకైన ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేసేస్తూ ఉంటారు . రాజమౌళి కన్నా కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చి చేసిన పేరు సందీప్ రెడ్డి వంగ. ఈ ఒక్క విషయంతో సందీప్ రెడ్డివంగా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు అంటున్నారు అభిమానులు..!