- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నట‌సింహం నందమూరి బాలకృష్ణ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావు కాంబినేషన్లో వచ్చిన క్లాసికల్ బ్లాక్ బస్టర్ తోలి టైం ట్రావెలర్ మూవీ ఆదిత్య 369 .. ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచనా లు క్రియేట్ చేస్తుందో కొత్త గా చెప్పాల్సిన పనిలేదు .. అలాగే ఈ సినిమా లో టైం మిషన్ ట్రావెల్ చేసి వేరే కాలాల కు ప్రయాణం కూడా చేస్తారు .. ఇలా సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా రావటం తో ప్రేక్షకుల కు ఇది బాగా నచ్చింది .. అలాగే టాలీవుడ్ లోనే ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సినిమా ల్లో ఆదిత్య 369 ప్రత్యేక సినిమా గా నిలిచింది .. అయితే ఇప్పుడు ఈ సినిమా ఈరోజు మళ్లీ థియేటర్ల లో రీ - రిలీజ్ అయింది .. దీంతో ఈ సినిమా ను మరోసారి వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు .  


అలాగే ఈ సినిమా లో ఎంతో కీలకమైన టైం మిషన్ అందరికీ తెలిసే ఉంటుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా రీ - రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ థియేటర్ వద్ద ఈ టైం మిషన్ ను ప్రేక్షకుల ప్రదర్శన కు పెట్టారు .. ఇక దీంతో అక్కడికి వచ్చే ప్రేక్షకులు దీన్ని చూసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు .. ఇక ఆదిత్య 369 సినిమా లో మోహిని హీరోయిన్ గా నటించిగా .. సిల్క్ స్మిత , సుత్తివేలు , అమ్రిష్ పూరి , టిన్ను ఆనంద్ వంటి వారు ముఖ్య పాత్ర లో నటించారు .. అలాగే ఇళయరాజా ఈ సినిమా కి సంగీతం అందించారు .. అయితే ఇప్పుడు ఈ సినిమా రీ - రిలీజ్‌లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: