
దేవర సినిమా తో సోలో గా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ .. ఈ సినిమాను రెండు భాగాలు గా ప్లాన్ చేసిన ఈ సినిమా మొదటి భాగం ఊహించని విజయం అందుకోవటం తో సీక్వెల్ మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి .. అందుకే స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు ప్రతి విషయం లోనూ రెండో భాగం విషయం లో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు . ఇదె క్రమం లో దేవర జపాన్ ప్రమోషన్ల సందర్భం గా సీక్వె ల్ గురించి కూడా ఎన్టీఆర్ మాట్లాడారు . రెండో భాగం లో ప్రేక్షకుల కు ఊహించని సర్ప్రైజ్ లు చాలా ఉండబోతున్నాయి .. అంతే కాకుండా మొదటి భాగం లో దేవర గురించి తెలుసుకున్నారు ఇప్పుడు ఈ సీక్వెల్ లో వర కథ చూడబోతున్నార ని కూడా చెప్పుకొచ్చాడు .
ఇక ఇదే సమయం లో దేవర కు ఏం జరిగింది అన్నది కూడా సీక్వెల్ లో రివిల్ చేస్తామ ని కూడా చెప్పారు . ఇక మొదటి భాగం కథ యాతి అనే వ్యక్తి కోసం పోలీసు లు వెతకడం తో మొదలవుతుంది .. కానీ ఆ క్యారెక్టర్ చూపించకుండా నే మొదటి భాగం ముగిసింది . ఆ క్యారెక్టర్ ఇప్పుడు కీలకంగా కనిపించనుంది .. అలాగే కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా ఈ రెండవ భాగం లో పలకరించబోతున్నట్టు గా కొన్ని వార్త లు వినిపిస్తున్నాయి .. ఇక మొదటి భాగం సూపర్ హిట్ అవ్వటం తో సిక్వెల్ మీద కూడా భారీ అంచనలు పెరిగిపోయాయి .. ఆ అంచనాల ను అందుకునే రేంజ్ లోనే కథ ను మరింత ఇంట్రెస్టింగ్ గా చెక్కుతున్నారు దర్శకుడు కొరటాల .