పుష్ప .. సినిమా తర్వాత వెయ్యి కళ్ళతో కోట్లాదిమంది జనాలు ఎదురుచూస్తున్న మూవీ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమానే.  ఎస్ ఎస్ ఎం బి 29 . ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏది రిలీజ్ అయిన ఏది లీక్ అయిన సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది అనే విషయం అందరికీ తెలుసు . కాగా మహేష్ బాబు ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.  ఈ సినిమా కోసం దాదాపు 12 కేజీల బరువు తగ్గాడట మహేష్ బాబు .


సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్  హిట్ అవ్వడమే కాకుండా ఇండియన్ ఫిలిం హిస్టరీకి మరొక ఆస్కార్ ని తీసుకొస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్ . అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కొన్ని నెగిటివ్ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా రాజమౌళి సినిమా షూటింగ్ కి టైం ఎక్కువగా తీసుకుంటూ ఉండడం .. రాజమౌళి సినిమాకి సంబంధించిన అప్డేట్ .. లుక్స్ ఏది రివీల్ చేయకపోవడం మైనస్ గా మారింది .



రాజమౌళి తన సినిమాకి పక్క ప్లాన్ తో ప్రమోషన్ నిర్వహిస్తారు . మరి ఈ సినిమా విషయంలో ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ..? అనేది అర్థం కావడం లేదు . అంతేకాదు ఇది మొత్తం ఒక నిధి కోసం జరిగే అడ్వెంచర్స్ మూవీ గా ఉండబోతుందట . ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తుంది . అయితే ఈ సినిమాలో రాజమౌళి అన్ని ఎమోషన్స్ పండించే విధంగా చూసుకుంటున్నాడట.  కానీ సినిమాలో ఒక్కటంటే ఒక్క రొమాంటిక్ యాంగిల్ కూడా లేకుండా పూర్తిగా అడ్వెంచర్స్ గా ఫ్యామిలీ అంతా కలిసి ఎంటర్టైనింగా చూసే విధంగా తెరకెక్కిస్తున్నారట . మహేష్ బాబు కెరియర్ లో ఇలాంటి సినిమా ఎప్పుడు కూడా చూడము చూడలేము అంటున్నారు మేకర్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: