చందు ముండేటి ..ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్ లు.. పాన్ ఇండియా డైరెక్టర్లు ఉన్నారు. కానీ చందు మొండేటి తెరకెక్కించే సినిమాలు చాలా చాలా వెరైటీగా ఉంటాయి. జనాలను ఆకట్టుకునే విధంగా రియాలిటీ కి చాలా దగ్గరగా ఉంటాయి అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అభిమానులు . కాగా రీసెంట్ గానే డైరెక్టర్ చందూ మొండేటి ..నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా "తండేల్" అనే సినిమాను తెరకెక్కించారు . ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనే విషయం అందరికీ తెలిసిందే .


అంతకుముందు "చందు ముండ్టి" తెరకెక్కించ్చిన సినిమాలన్నీ కూడా మంచి రివ్యూస్ దక్కించుకున్నాయి ..  ఈ సినిమాలు  కలెక్షన్స్ పరంగా కూడా కుమ్మేసాయి . ఇప్పుడు "చందు మొండేటి" నెక్స్ట్ ఏ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు అనేది బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కాగా డైరెక్టర్ చందు మండేటి నెక్స్ట్ "సూర్య"ను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది . కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎంత పక్కాగా సినిమాలను ఓకే చేస్తున్నాడు అన్న విషయం అందరికీ తెలుసు.  కధా.. కంటెంట్ ఉంటేనే ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్నారు .



లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా సరే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే రిజెక్ట్ చేసి పడేస్తున్నాడు.  రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సినిమానే కోలీవుడ్ హీరో  సూర్య రిజెక్ట్ చేశాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు . అయితే చందు మొండేటి రాసుకున్న కథ సూర్యకు బాగా నచ్చేసిందట . ఆ కారణంగానే కాల్ షీట్స్ అడ్జస్ట్ చేశారట.  త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: