టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో తనదైన నటనతో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూత్ లో నానికి విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా నాని చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో కూడా నానికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.



కాగా నాని ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో తన ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు. రీసెంట్ గా ఈ హీరో నటించిన సరిపోదా శనివారం సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో నాని మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. నాని తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని హిట్-3 సినిమాలో హీరోగా నటిస్తున్నారు.


హిట్-1 సినిమాలో హీరో విశ్వక్సేన్ నటించిన మంచి విజయాన్ని అందుకున్నాడు. హిట్-1 సినిమాకు సీక్వెల్ గా హిట్-2 సినిమాను తీశారు. ఈ సినిమాలో అడవి శేషు నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక హిట్-2 సినిమాకు సీక్వెల్ గా హిట్-3 సినిమాలో నేచురల్ స్టార్ నాని నటించిన బోతున్నారు. కాగా, ఈ సినిమాలో హీరో నానితో పాటు మరో తమిళ స్టార్ హీరో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హిట్-3 సినిమా క్లైమాక్స్ లో కార్తీ కనిపిస్తారని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: